ఈ బ్లాగు ఎందుకు?
తెలుగు భాషా జ్ఞానం కొఱవడుతోందని కొందరు వేదన పడుతున్నారు. పిల్గలు తెలుగు చదవలేక పోతున్నారని మరికొందరు వాపోతున్నారు. వ్రాయటం అలా ఉంచండి, తెలుగు మాట్లాడితే చాలు అనే దుస్థితిలో ఉన్నాం. ముందు ఆవిషయంలో జాగృతి రావాలి.
‘భాష చనిపోవటమేమిటి, అదేమన్నా ప్రాణమున్న వస్తువా’ అని కొంత మంది నిర్లక్ష్యంచేస్తారు.
ప్రాణి కదులుతున్నంత వరకూ, ఇంద్రియాలు పనిచేస్తున్నంత వరకూ ‘జీవి’ అంటాం. లేకపోతే ‘నిర్జీవి’ (మరీనిర్వచనంలోకి దూరిపోయి ‘మరి కోమా పేషంటు సంగతేంటి’ అని అడగద్దు).
అలాగే భాషకూడా - సంఘంలో అధిక శాతం ప్రజలు తమ మాతృభాషలో మాట, పాట, వ్రాత, చేత (చదవటం) చేస్తూఉన్నప్పుడే అది జీవ భాష. వ్రాత, చేత లేనప్పుడు అది (కోయ భాషలాగా) వాడుక భాషే కానీ, సాంప్రదాయ భాష అనిపించుకోదు.
ప్రపంచంలోని ప్రతి భాష లోనూ పరభాషలు చొచ్చుకుపోయాయ్, పోతున్నాయి. అది సహజంగా జరగవచ్చు, బలవంతంగా జరగవచ్చు.
మిగిలిన భాషల ప్రసక్తి వదిలి, మన భాష గురించి ఆలోచిద్దాం.
ముందుగా తెలుగులోకి సంస్కృత పదాలు చాలా వచ్చాయి. కోరి తెలుగు సాహిత్యవేత్తలూ పదాలను ఇష్టంగా స్వీకరించారు. చాలక, వ్యాకరణ పండితులు సంస్కృత సంథులు కూడా స్వీకరించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సంస్కృతము మన దేవభాషగా, తెలుగు అందులోని జిలుగు, వెలుగులను అద్దుకుని తన మూలాన్ని కాపాడుకొని వృద్ధి చెందింది.
ముస్లిముల పాలనలో ముందు బలవంతంగా (ప్రభుత్వ ఫర్మాన్లన్నీ ఉర్దూలో ఉండేవి, మన మీద ఆధిపత్యానికి మరొక ప్రతీక), తరవాత అవసరానికి ఉర్దూ పదాలు చేరాయి. వందల ఏళ్ల పాలనలో సర్దుబాటు చేసుకోక తప్పలేదు - ప్రాణరక్షణకై, క్షేమ జీవనానికై.
400 ఏళ్ల బ్రిటీషు సాంగత్యంలో, 200 ఏళ్లకు పైగా బ్రిటీషు పాలనలో, ఉర్దూలాగానే చొరపాటు మొదలయి, మరింత వేగంగా ఇంగ్లీషు భాష తెలుగులోకి ప్రవేశించింది. అదీ అవసరార్ధం కలుపుకున్నాం.
ఇంత జరిగినా తెలుగు భాష ప్రాభవం తగ్గలేదు.
1. తెలుగులో కీబోర్డు (తెకీ అందాం) లేనప్పుడు చాలామంది ఇంగ్లీషు కీ (ఇంకీ) బోర్డుకు అలవడ్డారు. తరవాత తెకీ బోర్డు వచ్చినా కూడా, ఇంకీ బాగా అలవాటయి, చాలా కొద్దిమంది మాత్రమేవాడుతున్నారు. మిగిలిన వాళ్లలో ఎక్కువ మంది ఇంకీ వాడితే, తక్కిన వాళ్లు ఇంగ్లీషు-టు-తెలుగు చేస్తున్నారు. ఆ విధంగా తెలుగు వాడకం తగ్గిపోతోంది.
2. వాడుక లోంచి తొలగిపోవటమే భాష నిర్జీవం పొందటం.
Comments
Post a Comment